పన్నీరుసెల్వంని బెదిరించి బలవంతంగా రాజీనామా చేపించారు.

పన్నీరుసెల్వంని బెదిరించి బలవంతంగా రాజీనామా చేపించారు.

తమిళనాట చినమ్మ శశికళని ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అన్నడి.ఎమ్.కే పార్టీ శాసన సభ్యుల ఆనందం నీరు కారుస్తూ శశికళ ప్రమాణ స్వీకారానికి ఆమె పై గతంలో నమోదైన కేసులు అడ్డుతగులుతున్న తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తిరిగి పన్నీర్ సెల్వం ని నియమించే నిర్ణయంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్య మంత్రిగా పన్నీర్ సెల్వం స్వయంగా రాజీనామా చేసి శశికళని భావి ముఖ్యమంత్రిగా ఆమోదించటానికి తానే శాసన సభ్యుల సమావేశంలో ప్రతిపాదన తీసుకు వచ్చారు. కాగా మంగళవారం రాత్రి అమ్మ జయలలిత సమాధి వద్ద దాదాపు 50 నిమిషాల పాటు మౌనం పాటించి అమ్మ కి నివాళులు అర్పించిన పన్నీర్ సెల్వం అనంతరం మీడియా తో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి చర్చనీయాంశం అయ్యారు.

“అమ్మకి నివాళులు అర్పించటానికి ఇక్కడికి వచ్చాను. నాతో అమ్మ ఆత్మ మాట్లాడుతోంది. రాష్ట్ర ప్రజల సంరక్షణని, అన్న డి.ఎమ్.కే భవిష్యత్తుని సమర్ధవంతంగా కాపాడమని హెచ్చరిస్తోంది. అమ్మ మరణం అనంతరం అయిష్టంగానే ముఖ్యమంత్రి పదవిని స్వీకరించాను. జల్లికట్టు సమస్య తలెత్తినప్పుడు కూడా నిర్విరామంగా పోరాడి తమిళ ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడాను. తమిళనాడు లో నెలకొన్న నీటి సమస్యకి పరిష్కారం కోసం పక్క రాష్ట్రాల ప్రభుత్వాలతో ఒప్పందాలకు సిద్ద పడ్డాను. అమ్మ కి వున్న కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించకుండా ఆవిడ బతికి వున్నప్పుడు విధేయుడిగా ఎలా అయితే పని చేసానో ఇప్పుడు కూడా అదే విధంగా పని చేస్తున్నా నా మంత్రి వర్గం నుంచే నాకు సహకారం కరువవుతుంది. నాకు తెలీకుండా శశికళని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే నిర్ణయం తీసుకున్నారు.

తరువాత శశికళ కుటుంబీకులు, అనుచర వర్గం నన్ను బెదిరించి, బలవంతపు రాజీనామా చేపించారు. వారి వల్ల తమిళనాడు రాష్ట్రానికి సుపరిపాలన అందదు అని స్పష్టత వచ్చేసింది. కేవలం వారి అధికార దాహాన్ని తీర్చుకోవటానికే వారు ముఖ్యమంత్రి హోదా పై కన్నేశారు. ఇందుకు అమ్మ జయలలిత ఆత్మ క్షమించదు. ముఖ్య మంత్రిగానే కాక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా శశికళ కి స్థానం కలిపించవద్దని మధు సూధన్ ని ప్రధాన కార్యదర్శిగా నియమించమంటూ అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది. ఇంకా నేను కొన్ని నిజాలు మాట్లాడాలి. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎన్నో వాస్తవాలను మీతో పంచుకుంటాను.” అంటూ పన్నీర్ సెల్వం మెరీనా బీచ్ లో అమ్మ సమాధి వద్ద మాట్లాడగా యావత్ తమిళనాడు లో ఇప్పుడు పన్నీర్ సెల్వం వ్యాఖ్యలపైనే చర్చ నడుస్తుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *