డియర్ జిందగీ వలన తనకు ఎం ప్రయోజనం కలగలేదంటున్న “అలియ భట్ట్”

డియర్ జిందగీ వలన తనకు ఎం ప్రయోజనం కలగలేదంటున్న “అలియ భట్ట్”

సినిమా పరిశ్రమలో కథానాయికలు అంటేనే గ్లామర్ ప్రపంచానికి కొత్త అర్ధం తెలిపేలా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. బొంబాయి కథానాయికలు అయితే ఈ విషయంలో పది మెట్లు పైనే ఉంటుంటారు. వయసు ముప్ఫైల్లో పడిన తరువాత కూడా కరీనా కపూర్ ఖాన్, ప్రియాంక చోప్రా, విద్య బాలన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి పలువురు కథానాయికలు గ్లామర్ ఫీల్డ్ లో రాణిస్తుంటే మరి యువ కథానాయికల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలే ఇప్పుడు బాలీవుడ్ కథానాయికలకు హాలీవుడ్ ద్వారాలు తెరుచుకోవటానికి గ్లామర్ డోస్ ఏ ప్రధాన కొలమానం గా నిలవటంతో బొంబాయి కథానాయికలు పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా ప్రతి సినిమాలో బికినీ షోలు, లిప్ లాక్లు, ఇంటిమేట్ సన్నివేశాలు అడిగి మరీ పెట్టించుకుంటున్నారు.

బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇస్తూనే మహేష్ భట్ కూతురు అలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో కుర్రకారు మనసులు దోచుకుంది. చేతన్ భగత్ రచించిన నవల టు స్టేట్స్ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన చిత్రంలో కథానాయికగా నటించిన ఆలియా భట్ ఆ చిత్రంలో చేసిన పలు లిప్ లాక్ సన్నివేశాలతో పాటు బోల్డ్ సన్నివేశాలకు బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిపోయింది. కానీ ఇటీవలి కాలంలో ఉడతా పంజాబ్ లో డీగ్లామరైజ్డ్ రోల్ చేయగా తాజాగా డియర్ జిందగీలో షారుఖ్ ఖాన్ తో తెరను పంచుకునే అవకాశం కోసం తన శైలి కానీ పాత్రలో కనిపించింది ఆలియా. అయితే డియర్ జిందగీ ఆలియా కెరీర్ కి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోయింది. దానితో ఆలియా భట్ ప్రేక్షకులకు తన శైలిలోకి వచ్చి చిత్రాలు చేస్తునట్టు నిరూపించటానికి తన లేటెస్ట్ ఫోటోలు రిలీజ్ చేసింది. బ్లూ డెనిమ్ లో ఫ్రీ టాప్ ధరించి ఫ్రంట్ హాఫ్ ఓపెన్ టాప్ తో తన సొగసైన కాళ్ళు చూపిస్తూ హై హీల్స్ ధరించి మెరిసిపోయే అందంతో తళ్లుకున్న మెరుస్తూ అలియా ఈజ్ బ్యాక్ అని ప్రేక్షకులని పలకరిస్తుంది. చూస్తుంటే రానున్న బద్రీనాథ్ కి దుల్హనియా, డ్రాగన్ చిత్రాలతో ఆలియా భట్ సెన్సార్ సభ్యులకి బాగా పని పెట్టేలా కనిపిస్తుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *