ఓ సరికొత్త గెటప్ తో “సంపు”

ఓ సరికొత్త గెటప్ తో “సంపు”

ఇటీవలి కాలంలో సినిమాలలో హాస్యం పండించాలంటే చాలా మంది దర్శక రచయితలు ప్రత్యేకమైన కామెడీ ట్రక్లను నమ్ముకోకుండా పలు సూపర్ హిట్ చిత్రాల నుంచి కొన్ని బిట్లను స్పూఫ్ చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటువంటి స్పూఫ్స్ ని పదే పదే చేయటం వల్లే అల్లరి నరేష్ కెరీర్ అటకెక్కింది. ఒకానొక సంధర్బములో వరుస విజయాలతో నిర్మాతలకు సేఫ్ హీరోగా నిలిచిన అల్లరి నరేష్ సరికొత్త హాస్య కథలని ఎంచుకోవటం మానేసి వరుసగా ఇతర హీరోలని ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులకు మొనాటనీ కలిగించటంతో అల్లరి నరేష్ కి వరుసగా పది చిత్రాలు పైగా మిశ్రమ ఫలితాలనే మిగిల్చాయి. అల్లరి నరేష్ తరహాలోనే బర్నింగ్ స్టార్ గా బిరుది ఇచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ఇప్పుడు కేవలం స్పూఫ్ లతో కొయినేమాలు చేస్తూ స్పూఫ్ స్టార్ అయిపోయాడు.

కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం హృదయ కాలేయం ఆశించని విజయం సాధించటంతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డ సంపూర్ణేష్ బాబు తరువాతి కాలంలో చేసిన బండి పోటు, సింగం 123 సినిమాలు ఘోర పరాజయాలు చెందాయి. సింగం 123 డిసాస్టర్ తరువాత కూడా సంపూ మారలేదు. కొబ్బరి మట్ట పేరుతో చేస్తున్న చిత్ర తొలి ప్రచార చిత్రాన్ని దాదాపు ఏడాదిన్నర్ర క్రితమే యూట్యూబ్ లో విడుదల చేయగా అందులో మంచు మోహన్ బాబు తరహాలో పెద్ద రాయుడు డైలాగులు చెప్తూ మరొక స్పూఫ్ ల సమూహారం అనే ఫీలింగ్ కలుగజేసాడు. ఈ టీజర్ విడుదలై చాలా కాలం అయినా ఈ చిత్రం పై ఎటువంటి అప్డేట్ లేకపోవటంతో ప్రేక్షకులు కొబ్బరి మట్ట ని పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు ట్రెండో స్టైల్ అని ఫీల్ అవుతున్న ఒక సరికొత్త గెటప్ ని విడుదల చేసి కొబ్బరి మట్ట ని మరొక సారి ప్రేక్షకులకి జ్ఞాపకం చేస్తున్నారు నిర్మాతలు. హృదయ కాలేయం చిత్రాన్ని తెరకెక్కించిన స్టీవెన్ శంకర్ ఈ చిత్రానికి కూడా స్క్రిప్ట్ అందించటంతో ఇది కూడా ఇమిటేషన్స్ మించి కొత్తగా ఏమి ఉండదనే అంచనానికి ఇప్పటికే ప్రేక్షకులు వచ్చేసారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *