షాహిద్ కపూర్ తో ఎఫ్ఫైర్ గురుంచి మాట్లాడిన సానియా మీర్జా !!

షాహిద్ కపూర్ తో ఎఫ్ఫైర్ గురుంచి మాట్లాడిన సానియా మీర్జా !!

సినిమా రంగానికి, క్రీడా రంగానికి చెందిన ప్రముఖ సెలబ్రిటీస్ ని తన షో కి ఆహ్వానించి ఆహ్లాదకరమైన ముచ్చట్లతో పాటు సమాధానం ఇవ్వలేని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు, విమర్శలకు తావిచ్చే చతుర్లతో బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రతి వారం కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం ని రసవత్తరంగా మలుస్తుంటారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ ఈ కార్యక్రమంలో కరణ్ జోహార్ సంధించిన వివిధ ప్రశ్నలకు ఇచ్చిన సూటి జవాబుల వల్ల కొన్ని అనుకోని వివాదాలలో కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది. అయితే ఈ వారం కరణ్ జోహార్ తన షో కి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ని అతిధిగా ఆహ్వానించి తన నుంచి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.

సానియా మీర్జా కి పాకిస్థాన్ కి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు షోయెబ్ మాలిక్ తో వివాహానికి మునుపు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ తో ఎఫ్ఫైర్ ఉన్నట్టు పలు కథనాలు జోరుగా వినిపించేవి. ఇదే విషయాన్ని ఇప్పుడు కరణ్ జోహార్ తన షో లో సానియా మీర్జా వద్ద ప్రస్తావించగా, “నేను నా వృత్తి రీత్యా వివిధ దేశాలకు ప్రయాణిస్తుంటాను. ఎంతో దూరం సాగే నా ప్రయాణంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి, ఎంతో మంది వ్యక్తులు పరిచయం అవుతుంటారు. వీటన్నిటి మధ్య నేను మీడియాలో ప్రచారానికి వచ్చే పుకార్ల ని ఎలా గుర్తుంచుకోగలను?” అంటూ చాలా తెలివైన సమాధానం చెప్పింది.

అయితే ఇంతటితో వదిలేస్తే అది కరణ్ జోహార్ షో ఎందుకు అవుతుంది? సానియా ని కరణ్ ఇదే విషయం పై తన ప్రశ్నల కొనసాగింపుగా మీరు షాహిద్ కపూర్ తో డేటింగ్ చేశారా అని అడగగా సానియా తన సమాధానం గా షాహిద్ కపూర్ తో డేటింగ్ చేయటం పై వచ్చిన వార్తలని ఖండించింది.

షాహిద్ కపూర్, రన్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ లలో మీరు ఒకరిని వివాహం చేసుకోవాల్సి వస్తే ఎవరినీ చేసుకుంటారని రాపిడ్ ఫైర్ లో అడగగా సానియా రన్బీర్ కపూర్ ని మనువాడతానని జవాబిచ్చి ఆశ్చర్యపరిచింది. మరి షాహిద్ కపూర్తో ఎం చేస్తారని అడగగా, షాహిద్ కపూర్ ని మర్డర్ చేస్తానని వైలెంట్ ఆన్సర్ ఇచ్చింది సానియా మీర్జా.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *