క్షీణిస్తున్న చినమ్మ రాజకీయ బలం

క్షీణిస్తున్న చినమ్మ రాజకీయ బలం

తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండగా అమ్మ జయలలిత మరణించిన అనంతరం తధ్యం అని అనుకున్న రాజకీయ అనిశ్చితి వెంటనే సంభవించనప్పటికీ రెండు నెలలు ఆలస్యంగా బహిర్గతం ఐయ్యింది. అమ్మకి వీర విధేయుడిగా పేరు వున్న పన్నీర్ సెల్వంకు ముఖ్య మంత్రి బాధ్యతలు అప్పగించిన నాడు అన్న డి.ఎం.కే పార్టీ కి చెందిన శాసన సభ్యుల దగ్గర నుంచి ఆ పార్టీ గ్రామీణ స్థాయి నేతల వరకు అందరి మద్దతు పుష్కలంగా వుంది. జల్లికట్టు పై సుప్రీమ్ తీర్పుని సైతం సవాల్ చేస్తూ తమిళుల భావోద్వేగాలకు విలువ ఇచ్చాడని పన్నీర్ సెల్వం కి ప్రజలలో విశ్వాసం మరింత పెరిగిందే తప్ప తరగలేదు.

అయితే శశికళ వర్గీయులు పన్నిన వ్యూహంలో, లేక నిజంగానే పన్నీర్ సెల్వం అసమర్ధత కారణమో తెలియదు కానీ రాత్రికి రాత్రే రాష్ట్ర రాజకీయ పరిస్థితులను అస్తవ్యస్తం చేస్తూ పన్నీర్ సెల్వం తన ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయటం, పార్టీ శాసన సభ్యుల సమావేశంలో చినమ్మ శశికళ ని ముఖ్య మంత్రి అభ్యర్థిగా పన్నీర్ సెల్వం స్వయంగా ప్రతిపాదించటం, శాసన సభ నేతలు మద్దతు పలుకుతూ శశికళని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిపోయాయి. కానీ అనంతరం పన్నీర్ సెల్వం తన వైఖరిని మార్చుకుంటూ రాజీనామా ఉపసంహరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో పన్నీర్ సెల్వం వర్గీయులు, శశికళ వర్గీయుల మధ్య దూరం పెరిగిపోయింది.

కాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్య మంత్రిగా అమ్మ జయలలిత ఆశయాలను సాధించే అర్హత వున్న వారెవరని సోషల్ మీడియా వేదికగా నిర్వహించబడ్డ పలు పోల్స్ లో నెటిజన్లు పన్నీర్ సెల్వంకే పట్టం కట్టారు. ఇదిలా ఉండగా జల్లికట్టు విషయంలో సినిమా స్టార్స్ అందరిలోనూ తొలుత తన అభిప్రాయాన్ని జల్లికట్టు కి మద్దతుగా వినిపించిన కమల్ హాసన్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నిక కాబడటానికి శశికళకి ఎటువంటి అర్హత లేదని, పన్నీర్ సెల్వం ముఖ్య మంత్రిగా బాగా పని చేస్తున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరో వైపు పార్టీ శ్రేణుల్లోనూ గడుస్తున్న ప్రతి నిమిషానికి శశికళ వర్గీయుల బలం క్రమంగా క్షీణిస్తుండటంతో రాష్ట్ర గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *