తెలుగు దేశం తీసుకున్న నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

తెలుగు దేశం తీసుకున్న నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

మహిళా పార్లమెంట్ సదస్సుని బాగా గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్నాం అని చెప్తున్నా అధికార పార్టీ తెలుగు దేశం నాయకులపై సోషల్ మీడియాలో వ్యతిరేకత తార స్థాయికిచేరిపోయింది. మహిళా పార్లియామెంట్ సద్ధస్సుకి అధికార పార్టీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులతోపాటు ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు, ఇతర ప్రముఖులకుఆహ్వానాలు అందగా ఈ సదస్సుకి హాజరు కావాలని ప్రయత్నించిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రజా ప్రతినిధి రోజాని సదస్సుకి హాజరు కావటానికి వీలు లేదంటూఅడ్డుకోవడంపై ఇప్పటికే మీడియా వారు అధికార పార్టీ నేతలని ప్రశ్నించగా వారి నుంచి సంబంధిత సమాధానం ఏది రాకపోవటంతో ప్రతి పక్షం ని ఎదురుకోలేక రోజానిసదస్సు కి హాజరు కావటానికి అనుమతి నిరాకరించారని నెటిజన్లు వరుస పోస్టులతో అధికార పార్టీకి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత పెరిగిపోవటంతో తాము చేపట్టిన చర్యలకు సమర్ధింపు వివరణలుమొదలు పెట్టారు తెలుగు దేశం నేతలు. మహిళా సదస్సు సజావుగా జరగటానికి తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలలో భాగంగానే రోజా అనుమతి కి ఆంక్షలువిధించామని, శాసన సభ వంటి చట్ట సభలో సంస్కారం కోల్పోయి మాట్లాడి ఏడాది పాటు సస్పెన్షన్ వేటుకి గురైన రోజా మహిళా పార్లమెంట్ సదస్సు లో హుందాగానడుచుకుంటారనే నమ్మకం కొరవడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్ధించుకున్నారు. ఈ సమాధానం తెలుగు దేశం నేతలు ఇవ్వకముందు వరకు ప్రజలలోవున్న ఆగ్రహంతో పోలిస్తే ఈ అర్థరహితమైన సమర్ధింపు సమాధానం అనంతరం అధికార పార్టీ పై ప్రజలలో ఆగ్రహం రెట్టింపు ఐయ్యిందనటానికి నిదర్శనం సోషల్మీడియాలో తెలుగు దేశం పార్టీ పై పెరుగుతున్న ట్రాలింగ్. ఇటీవల ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ పట్నం నగరంలో నిర్వహించ దలచిన నిరసన కార్యక్రమానికిహాజరు కాకుండా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ని అడ్డుకున్న సంఘటనని ఇంకా ప్రజలు మరిచిపోక ముందే అధికార పార్టీ ఇప్పుడు మహిళా పార్లమెంట్ సదస్సు కిరోజా ని అడ్డుకోవటంతో ప్రతిపక్షం పై ప్రజలలో సానుభూతిని పెంచటానికి తెలుగు దేశం పార్టీ పరోక్షంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయలు కూడావ్యక్తమవుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *