రామ్ గోపాల్ వర్మకి రసవత్తరమైన క్లైమాక్స్ దొరికేసింది

రామ్ గోపాల్ వర్మకి రసవత్తరమైన క్లైమాక్స్ దొరికేసింది

వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా 27 సంవత్సరాల నుంచి ఇటు తెలుగు అటు హిందీ సినిమాలతో బిజీగా వుండే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదమైన వ్యక్తుల జీవితాలపై కానీ, పరిణామాలపై కానీ సినిమాలు తీస్తూ వాటిని మరింత సంచలనం చేస్తుంటారు. రక్త చరిత్ర, 26 11 అటాక్స్, కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి వంటి క్రైమ్ బ్యాక్ డ్రాప్ వున్న అంశాలు తప్ప ఇతర దర్శకులలా బయోపిక్ అంటే క్రీడాకారుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు చేయటం అలవాటు లేదని, తనని క్రైమ్ ఆకర్షించినంతగా మరేది ఆకర్షించలేదని చెప్పే రామ్ గోపాల్ వర్మ కొద్ది రోజుల క్రితం శశికళ అనే చిత్రాన్ని జయలలిత మరణానంతరం ప్రకటించాడు.

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలతో శశికళ ప్రస్తానం కొత్త మలుపు తిరిగింది. పన్నీర్ సెల్వం ని జయలలిత అనంతరం ముఖ్య మంత్రిని చేసిన అన్న డి.ఎం.కే శాసన సభ్యులను తన వైపుకి తిప్పుకుని అమ్మ స్థానం పై ఆశపడ్డ శశికళ కి సుప్రీమ్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తో ఆక్రమ ఆస్తులు కలిగి వున్న కారణం కారాగార శిక్ష అనుభవించాల్సి వస్తోంది. మొన్నటి వరకు జయలలిత మరణంపై వున్న కొన్ని ఆరోపణల దృష్ట్యానే రామ్ గోపాల్ వర్మ శశికళ పై సినిమా చేయటానికి ఆసక్తి కనపరిచి ఉండొచ్చు. ఇప్పుడు శశికళ కథకి రసవత్తరమైన ముగింపు పలకటానికి వర్మ కి తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు దోహద పడుతున్నాయి. అయితే ఎన్నో సినిమాలను అనౌన్స్ చేసేసి వెంటనే వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అయిపోయే వర్మ శశికళ బయోపిక్ ని సీరియస్ గా తీసుకుంటాడో లేదో చెప్పలేం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *