నేరస్తులెవరో కోర్ట్ పదే పదే రుజువు చేసింది

నేరస్తులెవరో కోర్ట్ పదే పదే రుజువు చేసింది

తమిళనాడు రాష్ట్ర ప్రజలు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల గురించి యావత్ దేశమంతా చర్చించుకునే స్థాయికి ఆ రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోవటం తమిళులని కలవర పెడుతుంది. అనిశ్చితిని జయించి తిరిగి ప్రభుత్వాన్ని స్థిర పరిచిన అన్న డి.ఎం.కే పార్టీలోని అంతర్గత కలహాలు మాత్రం ప్రతిపక్ష డి.ఎం.కే కి ఏ క్షణాన అయినా అధికారం సమర్పించుకునే ప్రమాదం కూడా వుంది. అయితే పాలక వర్గం, ప్రతిపక్ష వర్గాలతోపాటు సూపర్ స్టార్ రజని కాంత్ వంటి సినిమా స్టార్ కి కూడా అధికారం చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ రజని కాంత్ రాజకీయ స్టేట్మెంట్స్ కి కూడా అమ్మడు దూరంలో ఉంటుంటారు. కానీ లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రం ట్విట్టర్ ద్వారా తన గళాన్ని బలంగానే వినిపిస్తున్నారు.

గతంలో కమల్ హాసన్ నటించిన విశ్వరూపం మరియు ఉత్తమ విలన్ చిత్రాలు రాజకీయ ఒత్తిడిలకు గురై విడుదలకు పాట్లు పడినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కమల్ హాసన్ ఆశావాదిగానే కనిపించేవారు. కానీ అమ్మ జయలలిత మరణం అనంతరం ఏర్పడిన రాజకీయ అనిశ్చితి విషయంలో మాత్రం ఆయన సహనం కోల్పోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్రమ ఆస్తులు కలిగి వున్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చినమ్మ శశికళ మాత్రమే దోషి కాదని, దివంగత ముఖ్యమంత్రి జయలలితను సైతం కోర్ట్ పదే పదే ఈ కేసులో దోషిగా రుజువు చేసిందని ఆయన గుర్తి చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో వున్న వారు జైలు శిక్ష అనుభవిస్తున్న వారి ఆదేశాల తో ప్రభుత్వాన్ని, పాలనని నడిపే బదులు నూతన ప్రభుత్వ స్థాపనకు నిర్ణయాన్ని ప్రజల ముందుకి ఎన్నికల ద్వారా తీసుకెళ్లటం అందరికి శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు కమల్ హాసన్.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *