కొత్త 1000 రూపాయల నోటుని ముద్రిస్తున్న ఆర్.బి.ఐ

కొత్త 1000 రూపాయల నోటుని ముద్రిస్తున్న ఆర్.బి.ఐ

గత ఏడాది నవంబర్ 8 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పెద్ద నోట్లు రద్దు కారణంగా రద్దైన 500 , 1000 నోట్ల ను రీప్లేస్ చేస్తూ కొత్త 500 రూపాయల నోట్లతో పాటు నూతనంగా 2000 ల రూపాయల నోటుని ప్రవేశ పెట్టింది రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా. అయితే అవినీతిని అరికట్టటానికి తీసుకున్న చర్యగా ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దుని అభివర్ణిస్తూ మళ్లీ 2000 నోటుని ప్రవేశపెట్టడంపై భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలైన రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైయ్యింది. గత ఏడాది డిసెంబర్ 30 వరకు పాత నోట్లను బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవటానికి కాల పరిమిత విధించిన అనంతరం డిసెంబర్ 30 తరువాత నల్ల కుబేరులను అంతమొందించటానికి మరింత కఠినంగా వ్యవరిస్తామంటూ చెప్పిన ప్రధాని, డిసెంబర్ 31 సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో 2000 నోటుని వెనక్కి తీసుకునే నిర్ణయం ప్రకటిస్తారని అందరూ అనుకున్నప్పటికీ అలాంటి పరిణామాలు ఏవీ చోటు చేసుకోలేదు.

పెద్ద నోట్ల రద్దు కేంద్రం చెప్తున్నట్టు నల్ల కుబేరులకు, సంపన్న వర్గాలకి చేసిన నష్టం కంటే చిరు ఉద్యోగులకి, చిన్న వ్యాపారస్తులకు నగదు అందుబాటులో లేక రోజుల తరబడి లైన్ లలో నిలబడాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ఇదే అంశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తమ కఠిన నిర్ణయాలను హోల్డ్ లో పెట్టిందనే అపవాదు కూడా భారతీయ జనతా పార్టీ పై వుంది. అయితే ప్రస్తుతం ఆర్.బి.ఐ అధిక సంఖ్యలో రద్దైన 1000 రూపాయల నోట్ల స్థానంలో కొత్త 1000 రూపాయల నోట్లను ముద్రిస్తుండటంతో అవి చలామణిలోకి తీసుకొచ్చి 2000 నోట్లను రద్దు చేస్తారనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఏది ఏమైనప్పటికి పెద్ద నోట్ల రద్దు చర్య సామాన్యుడిని ఎంత మేర కష్టపెట్టాయనేది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టత వచ్చే అవకాశాలు వున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *