అవార్డు వేడుకలలో అందాల మోత మోగిస్తున్న కథానాయిక

అవార్డు వేడుకలలో అందాల మోత మోగిస్తున్న కథానాయిక
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన దిశా పటాని తొలి చిత్రమే మిశ్రమ ఫలితాన్ని మిగల్చటంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. అందుకే బాలీవుడ్ కి వెళ్లి ప్రధాన కథానాయిక పాత్రలు కాకపోయినా సెకండ్ హీరోయిన్ అవకాశాల కోసం చేసిన ప్రయత్నాల ఫలితంగా ఎం.ఎస్.ధోని యాన్ అంటోల్డ్ స్టోరీ లో తక్కువ నిడివి కలిగిన పాత్రలో మెరిసింది. ఆ చిత్రం విడుదల సమయానికే యాక్షన్ కింగ్ జాకీ చాన్ కథానాయకుడిగా చైనీస్ మరియు ఆంగ్ల భాషల్లో నిర్మించబడ్డ కుంగ్ ఫు యోగా చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఎం.ఎస్.ధోని ది అంటోల్డ్ స్టోరీ లో చాలా తక్కువ నిడివి కలిగిన పాత్ర కావటంతో సినిమా విజయవంతంగా ప్రదర్షింపబడినప్పటికీ దిశా పటానికి పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పటికి జాకీ చాన్ చిత్ర అవకాశం చేతిలో వుండే సరికి దిశా కూడా లైట్ తీసుకుంది.
యాక్షన్ థ్రిల్లర్ గా భారీ అంచనాల మధ్యన విడుదలైన కుంగ్ ఫు యోగా మన దేశంలో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవటంతో దిశా పటాని పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వచ్చిన దిశా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అవకాశాలు పుంజుకోవటానికి మోడలింగ్ టెక్నిక్స్ నే పాటిస్తుంది. ఇటీవల జరిగిన జియో ఫిలింఫేర్ అవార్డ్స్ 2017 కార్యక్రమానికి దిశా పటాని అందాల ఆరబోతకు హద్దులు వంటివి ఏమి పెట్టుకోలేదని ఫిలిం మేకర్స్ కి సంకేతాలు పంపే విధంగా కాస్ట్యూమ్స్ ధరించి విచ్చేసింది. ఫోటోగ్రాఫర్స్ కి చేతి నిండా పని కలిపించిన దిశా పటాని తన అందాల ప్రదర్శనతో మొత్తానికి షో స్టీలర్ అయిపోయింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *