మోడీ నినాదాన్ని నిజం చేయనున్న కాంగ్రెస్!!

మోడీ నినాదాన్ని నిజం చేయనున్న కాంగ్రెస్!!

ఆ మధ్య జరిగిన యూపీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ చరిత్రకు చరమగీతం పాడేటట్టున్నాయా అంటే ఔననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో దారుణంగా చిత్తయిన కాంగ్రెస్ పార్టీ.. భవిష్యత్తులో మరింత పతనం కానుంది. పంజాబ్లో నెగ్గుకొచ్చి కాస్తంత నెగ్గుకొచ్చి పరువు నిలబెట్టుకున్నా… ఆ విజయం కాంగ్రెస్కి పెద్ద గా కలసి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే రాబోయే రెండేళ్లలో కాంగ్రెస్ కి మరిన్ని ఇబ్బందులు ఎదురుకానున్నాయి. యూపీలో రాయ్ బరేలీ వంటి తమ సొంత నియోజకవర్గాల్లో కూడా సత్తా చాటలేకపోయిన కాంగ్రెస్, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయంలా కనిపిస్తోంది. యూపీలో ముస్లింలకు బీజేపీ టికెట్లు ఇవ్వకపోయినా… 325 సీట్లు గెలుచుకుంది. అంటే ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఓటు బ్యాంకులో ఉన్న ముస్లిం ఓటర్లు పూర్తిగా బీజేపీ వైపు మళ్లారు. ఒక్క యూపీ పరాభవమే కాదు.. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ ఎలాగూ కాంగ్రెస్ నెగ్గలేదు. . ఇక వచ్చే ఏడాది కర్నాటకలో ఎన్నికల్లో నెగ్గుకొద్దామన్నా ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే ఆ పార్టీలో నెలకొన్న విబేధాలు ఆ పార్టీని గెలుపు తీరం చేర్చేలా కనిపించడం లేదు.

ఇక 2018లో మధ్య ప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కనీసం డిపాజిట్లు దక్కించుకోవడం కష్టమే. ఇక చత్తీస్ఘడ్, రాజస్థాన్లలో అధికార బీజేపీకే మళ్లీ అధికారం కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. ఇక 2018లో ఈశాన్య రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర లలో ఎన్నికల బాజా మోగనుంది. ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాగూ కాంగ్రెస్కి ఎదురు గాలి వీస్తోంది. ఇక యూపీ విజయంతో వచ్చే రెండేళ్లూ జరగబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం తప్పదు.

మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం 2019 సార్వ్రతిక ఎన్నికల మీద ఉంటుంది. ఈలోగా మోడీ మరిన్ని కీలక నిర్ణయాలతో ప్రజల మనసు మరోసారి గెలుచుకుంటే, ఈ సారి కేంద్రంలో మరింత మెజార్టీ దక్కించుకుని పీఠమెక్కే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఆరు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. మరో రెండు రాష్ట్రాల్లో భాగస్వామిగా ఉంది. ప్రస్తుతానికి పంజాబ్ లో ఐదేళ్ల అవకావం ఉన్నా… మిగిలిన వాటిల్లో త్వరగా కనుమరుగైపోయే ప్రమాదం లేకపోలేదు. అంటే మోడీ చెప్పిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం నిజం కాబోతుందన్నమాట.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *